words-of-love

ప్రేమ కలిగిన మాటలు – యోహాను 8:24– యేసు ఇలా అన్నాడు ” మీరు నాయందు నమ్మకం ఉంచకపోతే, మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురు “. ఎందుకంటే ఆయన నాకోసం మరణించాడు మరియు నాకోసం ఆయన పాపం అయ్యాడు. ఈ హెచ్చరిక మన ఆత్మల గురుంచి ఆయనకున్న ప్రేమ మరియు ఆందోళన కలిగిన మాటలు. ఎందుకంటె సాతనుడు ” మీరు ఖచ్చితముగా మరణించరు” (ఆదికాండము 3 : 4 ) అని చెప్పి జనులను మోసం చేస్తాడు. ఉదాహరణకు, సాతనుడు పాపం ఆహ్లాదకరమైనదిగా చూపుతాడు కానీ దాని ఫలితాలు చెప్పడు. మనము యేసు యొక్క మాటలను మాత్రమే విందాము.

heavenly-life

పరలోక జీవితం – యోహాను 8 : 23 -యేసు అవిశ్వాసులతో ఇలా అన్నాడు “మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను”. ఎందుకంటే ఈ లోకం గురుంచి మనకు తెలుసు మరియు లోక సంబంధమైన ఆశలు వస్తూనే ఉంటాయి (1 యోహాను 2 : 15 -17 చదువండి). స్నేహితుడా ఈ లోకములోని వస్తువులు మరియు విషయాలను గట్టిగా పట్టుకోకండి. మన ఆత్మ ఈ లోకం కొరకు చేయబడలేదు. ప్రభువా, ఈ లోకంపై నా పట్టు తేలికగా ఉండునట్లు నాకు సహాయం చేయండి. ఎలాగునంటే ఒక ప్రయాణికుడు పది సంచులు తిసుకోనకుండా ఒక్క సంచితో వెళ్ళినట్లు.

livig-with-christ

క్రీస్తుతో కలసి జీవించడం –యోహాను 8 : 21 – 22 – యేసు అవిశ్వాసులతో “నేను వెళ్ళు చోటుకు మీరు రాలేరు అని అన్నారు”. యేసు యొక్క ఉనికిని నుండి ఒక్క క్షణం కూడా నేను దూరంగా ఉండలేను. ఈ రోజు ఈ వాక్యమును నిదానముగా చదవండి – యోహాను 14 : 1, 2 – యేసు అనుచరులుగా ఇది మనకు ఒక గొప్ప వాగ్ధనంగా ఉన్నది. ఆయన మనందరి కొరకు ఒక చోటు సిద్ధం చేసినాడు మరియు మనము శాశ్వతముగా ఆయనతో ఉంటాము. ప్రభువా, నీవు నాకు చోటు సిద్ధం చేయుచుండగా, ఈ భూమిలో ఉన్నంత కాలం నా పూర్ణ హృదయంతో ఆరాధించాలి.

personal-prayer

ఈ రోజు వ్యక్తిగత ప్రార్థనలో సమయం గడుపుదాం. ఈ రోజువారీ ఆరాధనలు మన  జీవితంలో ప్రభావం కలిగించాలి అని ప్రార్ధన చేయాలి. నేను ప్రార్థన చేసినప్పుడు, నేను నా సొంత ప్రవృత్తులు నమ్మను కానీ నేను దేవునికి సమస్తము అప్పగిస్తాను అని అర్థం. అందువలన ఆయన నా నుండి నియంత్రణలోకి తీసుకుంటాడు. ఎందుకంటే నేను ధర (యేసు యొక్క విలువైన రక్తం) తో కొనుగోలు చేయబడినాను  మరియు నా శరీరం నాకు సంబంధించింది కాదు (1 కొరింథీయులకు 6:19, 20 ). ఈ రోజు మనము ప్రార్ధించుటకు మరియు దేవుని స్వరం వినుటకు ఒక  నిశ్శబ్ద ప్రదేశం కనుగొందాము. మీరు ఏమి నేర్చుకున్నారో నాకు తెలియచేయండి.

know-god

దేవుని గురించి తెలుసుకో- యోహాను 8: 19-20 -నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రిని కూడ ఎరిగి యుందురని వారితో యేసు చెప్పెను. దేవుని యొక్క ప్రేమ మరియు కృప అనుభవం పొందటం జీవితములో ఒక గొప్ప దీవెన. యేసు ప్రభువు ఉత్తముడు అని రుచి చూసినంత వరుకు నువ్వు సంతృప్తి చెందలేవు. ఉదాహరణకు, నీటి తొట్టె వలె నన్ను చేయు అని ప్రార్థన చేయండి, ఎందుకంటే దేవుని నుంచి ప్రేమను తీసుకొని మరియు ఇతరలుకు ప్రేమను ఇచ్చే విధముగా ఉంటాము ఎందుకంటే జీవము గల నది నుండి నీటిని తీసుకుంటున్నారు, చీకటి బారిన పడిన నిన్ను గెలుచుకోవటం కోసం ఆయన నీ కోసం బలి అయ్యారు. ఆయనే మొదట నన్ను ప్రేమించెను గనుక నేను ప్రేమించుచున్నాను.

dont-judge

తీర్పు తీర్చవద్దు – యోహాను 8: 15-18– యేసు “నా తీర్పు నిజం” అన్నారు. కానీ పరిసయ్యలు యేసుని తప్పుగా తీర్పు తీర్చారు. మన జీవితంలో సమస్య ఏమిటంటే మనము చాల త్వరగా ఇతరలును తప్పుగా తీర్పు తీర్చుతాము .1 కొరింథీయులకు 4: 5 ఇలా వ్రాయబడింది దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి .అయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలును బయలపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును. ఇతరులను తీర్పు తిర్చకుండా ఉండటానికి మనకు కృప అవసరం మరియు దేవుడు తీర్పు తీర్చు రోజు వరకు ఓపికగా వేచి ఉండటానికి కృప అవసరం. గుర్తుంచుకో, మనము తీర్పు తీర్చా వద్దు ఎందుకంటే యేసు కూడా తీర్పు తీర్చటానికి ఈ లోకములోకి రాలేదు కానీ మనలను రక్షించటానికి ఈ లోకములోకి వచ్చెను యోహాను 3:17 

walk-in-light

వెలుగులో నడవండి యోహాను 8 :13,14 – పరిసయ్యలు యేసే వారి వెలుగు అని నమ్మలేదు.వారు వారి సొంత మార్గాల్లో నమ్మిక ఉంచారు. మనకు కేవలం రెండు పద్దతలు ఎన్నుకోవటం ఒకటి మన కోరికలు నియంత్రించకోవటం మరియొకటి మన యొక్క కోరికలు మరియు నిర్ణయాలు యేసు విడిచిపెట్టటం . యేసుని అనుసరించటం చాలా కష్టం ఎందుకంటే మనము మన సొంత మార్గాల్లో నడవటానికి అలవాటుపడ్డము. ఒక మురికి గుడ్డను ఉతికి సూర్యని క్రింద వ్రేలాడదీసినట్టు, మనము మన యొక్క కోరికలు మరియు నిర్ణయాలు వెలుగు క్రిందకు తీసుకువచ్చి యేసు ప్రభువుకు విడిచిపెడదాము.

follow-the-light

వెలుగుని అనుసరించండి –యోహాను 8:12 – యేసు “నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండునని “ వారితో చెప్పెను. నిన్న ధ్యానించుకున్న విధముగా యేసుని అనుసరించకుండ ఈ యుగ సంబంధమైన దేవత మనలను అడ్డగిస్తుంది . దేవునితో సమయము గడపకుండా అతను మనలను అడ్డగిస్తున్నాడు – వ్యక్తిగత ప్రార్థన మరియు దేవుని వాక్య ధ్యానము. అతను మనలను ఇతర విశ్వాసులతో సమయం గడపకుండ అపుతాడు. దృష్ట చీకటి శక్తులుతో పోరాడటానికి శక్తి కోసం దేవుని అడగండి ఎందుకంటే అది మనలను దేవునిని అనుసరించకుండ వేరే మార్గములో నడిపిస్తుంది. రండి ఈ రోజు యేసుతో సమయం గడుపుదాము.

do-yo-see-the-light-copy

మీరు వెలుగుని చూసారా ? యోహాను 8:12 – యేసు”నేను లోకమునకు వెలుగును “అన్నారు. యేసు యొక్క వెలుగు మన జీవితంలో అనేక సమస్యలు నివారించేందుకు మరియు మనకు మార్గం చూపించుటకు సహాయపడుతుంది. కానీ యేసు యొక్క వెలుగుని చూడకుండ ఈ యుగ సంబందమైన దేవత మనలను అడ్డగిస్తుంది (2 కొరింథీయులు 4: 4).అతను ఈ లోకములో దేవుడని పిలవబడుతున్నాడు . దేవుని ప్రజలుకు యేసు యొక్క వెలుగుని చూడకుండ గుడ్డితనము కలుగజేయటమే అతని పని.యేసు యొక్క వెలుగును మరియు మహిమను చూడకుండ వ్యాపార మరియు లోకము మీద ఆశ అనేవి గుడ్డితనము కలుగజేయకుండ నేను ప్రార్థన చేస్తున్నాను.

how-to-sin-no-more

ఇక పాపం చేయకుండా ఉండడం ఎలా ? – యోహాను 8 : 10-11 – యేసు ఇలా అన్నాడు “వెళ్ళు , ఇప్పుడు నుండి పాపం చేయకు”. “ఇక పాపము చేయకు” అంటే అర్థం ఏమిటి ? దాని అర్ధం యేసు ఆమె జీవితాన్ని మార్చుకోమని ప్రోత్సహించాడు. యేసు ఆమె గత జీవితం ఖండించ లేదు కాని విశ్వాసముతో ముందుకు వెళ్ళమని ప్రోత్సహించాడు. ఈ రోజు , మీరు క్రీస్తులో ఉన్నప్పుడు, మీరు ఖండించబడరు (రోమా 8: 1 ) కానీ అతని దయ ( రోమా 6 : 14) ద్వారా పాపం అధిగమించడానికి బలం పొందుతుంది. ఒక వేళ మీ గతం మిమల్ని ముందుకు వెళ్ళ కుండ ఆపుతుంటే, వెంటనే మీరు పాపం అధిగమించడానికి యేసు వైపు చూడండి.

obeying-conscience

మనస్సాక్షి పాటించుట – యోహాను 8 : 9 – కఠిన మనసు కలిగిన ఆ ప్రజలు రాళ్ళు విడిచిపెట్టారు. ఎందుకు ? ఎందుకంటే వారికి సున్నితమైన మనస్సాక్షి ఉన్నది. దేవుని పిల్లలమైన మన మనస్సాక్షి దేవుని ప్రేమలో మరియు ఆత్మలో చుట్టి ఉండుట అవసరం. కాబట్టి దేవుడు బైబిల్ ద్వారా లేదా ప్రార్థన సమయంలో మనతో మాట్లాడేటప్పుడు వెంటనే పశ్చాత్తాప లేదా ద్వేషం యొక్క రాళ్లు విడిచిపెట్టాలి. కాబట్టి మనము సున్నిత మనసాక్షి కోసం మాత్రమే కాదు కాని యేసు రక్తంతో ప్రోక్షించబడిన రక్తం కోసం ప్రార్థన చేద్దాం. ఇది ఆజ్ఞానుసారం మరియు ఆనందం జీవితం యొక్క ప్రారంభం. ఆమెన్.

drop-the-stone

ఆ రాయిని విడిచిపెట్టండి – యోహాను 8:7-8 – యేసు యందు పాపం లేక పోయినా సరే ఆ స్త్రీపై రాయి విసరలేదు. ఒక మనిషిని ద్వేషించుటకు వెయ్యి కారణాలు ఉండవచ్చు కాని వారిని ప్రేమించుటకు ఒక్క కారణం ఉంది. యేసు యొక్క ఆత్మ కలిగిన మనుషులము అయిన మనము ఎలా రాయి విసురుటకు పట్టుకుంటాము? రాళ్ళు విసురుట మన రక్షకుని ఆత్మ కాదు. కాబట్టి నన్నుఎవరు బాధ పెట్టినాకుడా లేక నన్ను ద్వేషించినాకుడా నేను రాయి పట్టుకోను మరియు రాయి విసరను. ప్రభువా, నీ మనసు తెలుసుకొని మరియు నీ ప్రేమలో నివసించుటకు సహాయం చేయుము.

accuser-or-forgiver

క్షమించుట లేక ధూషించుట- యోహాను 8 : 3 -6 – మత పెద్దలు వ్యభిచారంలో ఉన్న స్త్రీని ధూషించుట మనము చూస్తున్నాము. ధూషించు ఆత్మ ఎన్నటికి క్షమించలేదు. అది ఎప్పుడు ఇతరుల తప్పులు కనుగొంటుంది మరియు వారు ఎప్పుడు చెడ్డవారిగా వుహించుకుంటుంది. సాతనుడు జనులను ఎప్పుడు ధూషిస్తు వుంటాడు (ప్రకటన 12:10). మనకు ధూషించు ఆత్మ వద్దు కాని క్షమించు యేసు ఆత్మ మనకు కావలి. ప్రభువా, ఈ రోజునుంచి ఇతరుల తప్పులు కనిపెట్టు స్వభావం నుండి విడుదల ఇవ్వండి మరియు సమస్తమును మీకు సమర్పించు హృదయం దయచేయండి. ప్రేమించే మీ హృదయం నాకు కావలి.

listen

యేసు చెప్పింది వినండి – యోహాను 8 : 1-2 – ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో కుడా యేసు ఉదయాన్నే బోధ చేయుట ప్రారంబించాడు. ఈ పరిస్థితి ఎలా ఉందంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు వచ్చినా కూడా విద్యార్ధులు ఇంకా రాకపోవుట వంటిది. యేసు నుండి నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందాము. ఇతరలను నిస్వార్ధముగా ప్రేమించుట, మన చిత్తం త్యాగం చేయుట మరియు స్వార్ధం నుంచి విడుదల ఇవి అన్ని వేరే ఎవరు మనకు నేర్పగలరు? యేసు మీకు అనేక సత్యములు బహిర్గతం చేయాలి అని ఆశిస్తున్నాడు. ఈ రోజు కొంచం సమయం తీసుకొని యోహాను 8 చదవండి మరియు దేవుని స్వరం వినండి. ప్రభువా, నా చెవులు తెరవండి.

spiritual-growth

ఆత్మీయ ఎదుగుదల – యోహాను 7 : 50 – 53b – కృపలో పెరగడం అంటే ఏమిటి? ఉదాహరణకు మీ జీవితంలో కొన్ని విజయాలు గురించి రహస్యంగా అతిశయించవొచ్చు, ఇందువలన మీరు ఇతరలను అన్యాయంగా తీర్పు తీర్చివుండవోచ్చు. కాని ఇప్పుడు దేవుడు మీకు తగ్గింపు నేర్పి ఉండొచ్చు. ఇప్పుడు మనము తగ్గించుకున్నాము ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు మనము సమస్తము దేవుని కృప ద్వారా పొందుకున్నాము మరియు మనము అతిశయించ వలసినది ఏమి లేదు (1 కొరింథీయులకు 4: 7). మనము దేవుని ఇష్టానుసారముగా నడిచినప్పుడు, మీ జీవితంలో సరిదిద్దవలసిన ఇతర ప్రాంతాల్లో ఆయన పని చేస్తాడు.

grow-dont-stand

ఎదగండి, ఆగిపోవోద్దు – యోహాను 7: 50 – 53a – నికోదేము బహిరంగముగా యేసుకు మద్దతు ఇచాడు. మొదట, ఆయన యేసుకు రహస్య అనుచరుడుగా ఉన్నాడు. మనము జీవితములోని అన్ని విషయాలలో ఎదుగుదల కోరుకుంటాము – ఉద్యోగం, విద్య, జ్ఞానం. కాని దేవునిలో ఎదగటం మరియు ఆయన హృదయం తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. ఆత్మీయ జ్ఞానం యొక్క ఉదాహరణ మనము రేపు చూస్తాము. ఈ రోజు మీరు సమయం ప్రార్ధనలో గడిపి దేవుని అంతరంగం తెలుసుకోవాలని మరియు ఆయన కృపలో ఎదగాలని ప్రభువుని అడగండి. యేసు నామములో. ఆమెన్

follow-jesus-not-releigion

యేసును అనుసరించండి మతం కాదు – యోహాను 7 : 47-49 – యేసును ద్వేషించిన పరిసయ్యలు ఇలా అన్నారు “సంప్రదాయాలు తెలియని ప్రజలు, శాపగ్రస్తులగుదురు”. ఒక మతంను అనుసరించడం అంటే సంప్రదాయాలు తెలుసుకొనటం మరియు పాటించడం. కానీ యేసుని అనుసరించడం అంటే యేసును వ్యక్తిగతంగా తెలుసుకోవడం. మీరు మీ జీవితములో సంప్రదాయం కొరకు ఏమైనా చేస్తున్నారా? ఉదాహరణకు, బైబిల్ చదవడం ఒక సంప్రదాయంగా ఉండవొచ్చు. కానీ యేసు యొక్క అనుచరుడుకు, దేవునిని గురుంచి తెలుసుకోవడం మరియు ఆయన స్వరం వినడం ఎంతో ఉత్తేజకరమైన విషయం

words-of-jesus

యేసు యొక్క మాటలు – యోహాను 7 : 45-48 – “ఎప్పుడు ఏ మనిషి ఇలా మాట్లాడలేదు” అని యేసును బంధించాలి అనుకోనిన ఆధికారులు అన్నారు. యేసు యొక్క మాటలు చిన్న పిల్లలు కూడా అర్ధం చేసుకునేంత సులభంగా మరియు హృదయాలను మార్చగలిగినంత శక్తిమంతంగా ఉన్నవి. యోహాను6 :63 లో యేసు అన్నాడు తన మాటలు ఆత్మియమైనవి మరియు నమ్మినవారికి జీవమిచ్చు మాటలు అన్నాడు. నమ్ముట అంటే మనము ప్రతిరోజు వినే మాటలకన్నా, ఆలోచనలకన్నా ఆయన మాటలనే విశ్వసించి మరియు అనుసరించుట. వేగంగా వాక్యం చదవకుండా నిధానంగా ధ్యానించి మహిమను పొందండి.

who-is-jesus

యేసు ఎవరు? – యోహాను 7 : 40-44 – ప్రజలు యేసు ఒక ప్రవక్త, ఒక మంచి వ్యక్తి లేదా క్రీస్తు అని చెప్పారు. మీకు వ్యక్తిగతంగా యేసు ఎవరు? ఆయన మన ప్రభువు మరియు రక్షకుడు. ఆయన మన పాపాలను నుండి రక్షించాడు మరియు మనలను విమోచించాడు కనుక ఆయన మన రక్షకుడై యున్నాడు. మనలను నడిపించి మరియు మన జీవితములో సమస్తమైన వాటి మీద ప్రాధాన్యత తీసుకున్నాడు కనుక ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడు (2 పేతురు3:18). ఆయన నాతో ఏమి చెబుతాడో అది నేను చేస్తాను. ఆయన ఏమి నేర్పుతాడో అది నేర్చుకుంటాను. ఎక్కడికి నడిపిస్తాడో అక్కడికి నడుస్తాను. సొంత విషయాలకన్నా, కుటుంబము కన్నా మరియు అనిటికన్నా మొదటి స్థానం ప్రభువుకే ఉండాలి అని ప్రార్ధన చేస్తున్నాను.

సొంత జ్ఞానం కాదు మనసుతో – యోహాను 7 : 40-43 – యేసుని అనుమానించిన వ్యక్తులకు ధర్మశాస్త్రములో ఎంతో జ్ఞానం ఉన్నది. కానీ ఇది వారి తలలోని సొంత జ్ఞానం ఎందుకంటే దేవుని వాక్కు యొక్క ప్రభావం వారిలో లేదు. మన మనసులో మార్పు లేనప్పుడు బైబిల్ గురించి వాస్తవాలు తెలియటం వలన ఉపయోగం లేదు. సాతాను దేవునిని విశ్వసిస్తాడు మరియు ఆయన ముందు వణుకుతాడు కాని మారడు (యాకోబు 2 : 19). ప్రభువా, నాకు జ్ఞానం హృదయంలో ఉండాలి – నిన్ను సంపూర్తిగా తెలుసుకోవాలి మరియు నన్ను మార్చాలి. మీ వాక్యం నా హృదయంలో కార్యం చేయుటకు మీ కృప కావలి.

పొందుకొనుటకు విశ్వసించండి – యోహాను 7 : 39 – యేసు జీవజలములు గురుంచి మాట్లాడుతున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ గురంచి మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితం జీవించడానికి రెండు మార్గాలు ఉన్నవి 1) మన సొంత బలంతో స్వార్థ జీవితంపై ఎటువంటి విజయం లేకుండా జీవించడం 2) మన స్వార్ధ జీవితం మనలను విడుచుటకు పరిశుద్ధాత్మశక్తీ మనలో పనిచేయునట్లు జీవించడం. మనమందరమూ పరిశుద్ధాత్మ శక్తీతో జీవించాలని యేసు ఆశపడుచున్నాడు. అందుకే అన్నాడు నేను మీకోరకు ఒక సహాయకుడను పంపుతాను ( యోహాను 14 : 16). ఈరోజు మనము శక్తీ పొందుటకు విశ్వాసంతో ప్రార్ధన చేద్దాము .

from-thirt-to-flowing

దాహం నుండి ప్రవహించుట వరకు – యోహాను 7 : 38బ్ – మనము క్రైస్తవ జీవితం మన భావాలు మరియు కోరికలు ఆధారంగా జీవించవచ్చు లేదా పరిశుద్ధాత్మ ఆధారంగా జీవించవచ్చు. మీరు ఎతైన ఒక దారిలో ప్రయాణిస్తుంటే, మీరు ఒక సైకిల్ తో ( స్వీయ) కష్ట పడవచ్చు లేదా ఒక మోటార్ శక్తి ( పరిశుద్ధాత్మ) బైక్ ఉపయోగించవచ్చు. నేను ప్రార్థన చెస్తునాను, మీరు 2016లో పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం జీవించాలని. యేసు ద్వారా సంతోషకరమయిన మరియు దేవునితో అతి దెగ్గరగా ఉండే జీవితం జీవించాలని. ప్రతి చిన్న మరియు పెద్ద విషయాల్లో దేవునికి సమర్పించిన ఒక దీవేనకరమయిన జీవితం ఉండాలని.